BREAKING
thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి
Date of Publish : 06 October 2026, 09:02 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

మంచిర్యాలలో కాంగ్రెస్ వర్గపోరుపై ఎమ్మెల్యే వర్గీయుల హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
06 Oct, 2026 - 09:02 PM
42 వీక్షణలు

మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ తీరును మార్చుకోవాలని డిమాండ్

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు దారితీసేలా వ్యవహరిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ తమ పద్ధతిని మార్చుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు డిమాండ్ చేశారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు కొనసాగితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పీసీసీ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

మంగళవారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడారు.

మంచిర్యాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేపడుతున్న కార్యక్రమాలను కొందరు జీర్ణించుకోలేక పార్టీ అంతర్గతంగా విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. మంతెన జగన్మోహన్‌రావు కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు కారణమయ్యేలా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నేతల స్పందన వెలువడాల్సి ఉంది.

అన్ని డివిజన్లకు ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయించాలి

మంచిర్యాల నగరంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులను సమానంగా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. నగరంలోని అన్ని డివిజన్ల ప్రజల ఓట్లతోనే ఎంపీ విజయం సాధించారని, అందువల్ల ప్రతి డివిజన్‌కు అభివృద్ధి నిధులు అందేలా చూడాలని కోరారు.

కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే కొన్ని కార్యక్రమాల ఫ్లెక్సీల్లో మేయర్, డిప్యూటీ మేయర్, ఏఎంసీ చైర్మన్‌ల ఫొటోలు ఉద్దేశపూర్వకంగా పెట్టడం లేదని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి వివక్ష తగదని అన్నారు.

కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో ప్రేమ్‌సాగర్‌రావు పాత్ర: వర్గీయులు

కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం, ఇంద్రవెల్లి సభ తదితర కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఆయన పనిచేశారని తెలిపారు.

ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీకి చెందిన సర్పంచులు, కార్పొరేటర్లపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.

ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాలి

మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆయనకు మంత్రి పదవి లభిస్తే నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న అంశాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించి, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వర్గీయులు కోరారు.