మాదాపూర్‌లో యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్, సెప్టెంబరు 22: మాదాపూర్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సిద్దిఖీనగర్‌లోని ఓయో గదిలో విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖిత మృతి చెందినట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. నిఖిత తనకు పరిచయమైన శ్రీనివాస రవితేజతో కలిసి హోటల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు.
యువతి ముఖం, తలపై గాయాల గుర్తులు ఉన్నట్లు సమాచారం. హోటల్ గదిలో రక్తపు మరకలు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, గాయాలకు గల కారణాలు, యువతి మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఆస్పత్రి నుంచి శ్రీనివాస రవితేజ వెళ్లిపోయినట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.
యువతి మృతికి అసలు కారణం పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.