BREAKING
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న
www.ntodaynews.com

టీజీ ఐసెట్-2026కు పరీక్షకు సర్వం సిద్ధం

తెలంగాణ
/ నల్గొండ
11 May, 2026 - 06:23 PM
125 వీక్షణలు

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

*​రాష్ట్రవ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు : ఐసెట్ కన్వీనర్ ఆచార్య అల్వాల రవి

NTODAY NEWS నల్గొండ జిల్లా 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్-2026 పరీక్షలకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 13, 14 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు వర్సిటీ యంత్రాంగం సిద్ధమైందని ఐసెట్ కన్వీనర్ ఆచార్య అల్వాల రవి వెల్లడించారు. ఈ పరీక్షకు 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ​ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 56,223 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.  ఇందులో 30,308 మంది మహిళా అభ్యర్థులు కాగా, 25,915 మంది పురుషులు ఉన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం తెలంగాణ వ్యాప్తంగా 16 రీజినల్ సెంటర్లు, 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 100 మంది ప్రత్యేక పరిశీలకులను  నియమించినట్లు కన్వీనర్ తెలిపారు. ​మే 13: రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.​మే 14 న ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు​ ఉదయం సెషన్  8:30 గంటల నుంచి , మధ్యాహ్నం సెషన్ వారిని 1:30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9:45 గంటల తర్వాత, మధ్యాహ్నం 1:45 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. ​పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి కేంద్రాన్ని సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఒక ఒరిజినల్ ఐడీ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. దివ్యాంగులు మరియు ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ప్రత్యేక వసతులు కల్పించారు. ఎంజీయూకు వరుసగా రెండోసారి ఐసెట్ నిర్వహణ బాధ్యతలు రావడంతో, అధికారులు మరింత అప్రమత్తంగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని, పరీక్షా కేంద్రాలకు గంటన్నర ముందుగానే చేరుకోవాలని ఆచార్య అల్వాల రవి కోరారు.