BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 12 June 2026, 09:25 pm
Posted by : కూనురు మధు

టీయూవీ జిల్లా ఉపాధ్యక్షుడిగా జోగు అశోక్ కుమార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 Jun, 2026 - 09:25 PM
149 వీక్షణలు

తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా చిట్యాల మండలం తాళ్లవెల్లెంల గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు జోగు అశోక్ కుమార్ నియమితులయ్యారు. శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ లు జోగు అశోక్ కుమార్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో జోగు అశోక్ కుమార్ చురుకైన పాత్ర పోషించారని, ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ పదవిని అప్పగించినట్లు నాయకులు తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి జోగు అశోక్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం సంస్థ ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.