BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:27 pm
Posted by : K MAHESH

క్రీడల్లో రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:27 PM
13 వీక్షణలు

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు సందీప్.. జాతీయ స్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు అమూల్య ఎంపిక

రామన్నపేట, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.

కళాశాలలో హెచ్‌ఈసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న గడ్డం సందీప్ హాకీ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అదేవిధంగా సీఈసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని అమూల్య స్పీడ్ హ్యాండ్‌బాల్ క్రీడలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. వీరిద్దరూ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ చంద్రముఖి జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరూ చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఈ ప్రాంత విద్యార్థుల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, క్రీడాకారులకు కళాశాల తరఫున ఎల్లప్పుడూ పూర్తి ప్రోత్సాహం అందిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు తమ ప్రతిభతో కళాశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.