పుంగనూరులో టీడీపీ–జనసేన నాయకుల భేటీ.. కూటమి సమన్వయంపై చర్చ
పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరులో జనసేన పార్టీ నాయకులు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మధుసూదన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూటమి ఐక్యత, పరస్పర సమన్వయం, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు.
కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కలిసి పనిచేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు. జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం సహకరించుకుంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చర్చించారు.
కూటమి ఐక్యతను కాపాడుకుంటూ ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని జనసేన నాయకులు తెలిపారు. కూటమి ఐక్యత రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్నిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల జనసేన అధ్యక్షుడు విరూపాక్షి, పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, మండల సీనియర్ నాయకులు శివకుమార్ రెడ్డి, పాముల హరి, మండల కార్యదర్శి బాలాజీ నాయక్, కుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, జీఎన్ బాబు, పండు రాయల్, శ్రీనివాసులు, వీర మహిళ అరుణ, సోమల మండల అధ్యక్షుడు భూషణ్ రాయల్, సోమల ఏఎంసీ డైరెక్టర్ మురళి రాయల్, జాకీర్, సోము, చౌడేపల్లి మండల నాయకులు మురళి, జావేద్, కాలేషా తదితరులు పాల్గొన్నారు.