BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 06:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో రెబల్ అభ్యర్థులకు టీడీపీ అధిష్టానం గట్టి హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Nov, 2026 - 06:03 PM
76 వీక్షణలు

 కూటమి ప్రకటించిన అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలి.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు నలుగురు గ్రామాల సర్పంచ్ అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించిన టీడీపీ మండల నాయకత్వం

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి మరింత పెరిగింది. ఉమ్మడి కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న రెబల్ అభ్యర్థులకు టీడీపీ మండల నాయకత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని, వ్యక్తిగత అభిప్రాయాలు, స్వప్రయోజనాల కోసం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు ఉమ్మడి కూటమి తరఫున నాలుగు గ్రామాల సర్పంచ్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు వెల్లడించారు. చాట్రాయి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గడ్డం ప్రభాకర్ రెడ్డి, పోలవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యర్రా రజిని, జనార్ధనవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నడిపింటి వెంకటేశ్వరరావు, పర్వతాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బొర్రా రామకృష్ణ పేర్లను అధికారికంగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ నాలుగు గ్రామాల్లో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా ప్రకటించిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత పట్టింపులు, వర్గ విభేదాలు, ఆధిపత్య పోరుకు తావివ్వడం వల్ల ప్రత్యర్థులకు అవకాశం కల్పించినట్లవుతుందని హెచ్చరించారు. పార్టీ జెండా కింద పనిచేస్తూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రం అధిష్టానం ఆదేశాలను పక్కనపెట్టి రెబల్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచినా, పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా అటువంటి వ్యవహారాలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. కూటమి నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా చేస్తామని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఉండాలని, అదే సమయంలో పార్టీ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఒకే గ్రామంలో కూటమి నాయకులు వేర్వేరు వర్గాలుగా విడిపోయి పనిచేస్తే పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని, అలాంటి పరిస్థితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి పార్టీ ప్రకటించిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నాలుగు గ్రామాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేసి పార్టీ ఐక్యతను చాటాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ తేళ్లూరి శేఖర్, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, బిలుగుది జయరాజు, రాజా, బొర్రా నాగేశ్వరరావు, ఉయ్యాల దిలీప్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.