BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 14 October 2026, 11:45 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మనక్ మహోత్సవ్ కార్యక్రమంలోపాకల ఉపాధ్యాయుడు విజయానంద్ కి బి ఐ ఎస్ బెస్ట్ మెంటార్ అవార్డ్ ప్రధానం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
14 Oct, 2026 - 11:45 PM
8 వీక్షణలు

బీఐఎస్‌ బెస్ట్‌ మెంటార్‌గా పాకల ఉపాధ్యాయుడు విజయానంద్‌

వరల్డ్‌ స్టాండర్డ్స్‌ డే సందర్భంగా ‘మనక్‌ మహోత్సవ్‌’లో అవార్డు ప్రదానం

సింగరాయకొండ, అక్టోబర్‌ 14 (ఎన్‌ టుడే న్యూస్‌): పాకల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన బయాలజీ ఉపాధ్యాయుడు, బీఐఎస్‌ క్లబ్‌ మెంటార్‌ డి. విజయానంద్‌ 2025–26 విద్యా సంవత్సరానికి ఉత్తమ మెంటార్‌గా ఎంపికయ్యారు. విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ భవనంలో వరల్డ్‌ స్టాండర్డ్స్‌ డే సందర్భంగా నిర్వహించిన ‘మనక్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో ఆయనకు అవార్డు ప్రదానం చేశారు.

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) విజయవాడ డైరెక్టర్‌ పి. ప్రేమ్‌ సజని చేతుల మీదుగా విజయానంద్‌ ఈ అవార్డును అందుకున్నారు.

పాఠశాల స్థాయిలో బీఐఎస్‌ క్లబ్‌ ద్వారా విద్యార్థులకు వివిధ ఉత్పత్తుల నాణ్యత, భద్రత, వినియోగదారుల హక్కులు, ఐఎస్‌ఐ ముద్ర, హాల్‌మార్క్‌ వంటి అంశాలపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలపై చైతన్యం పెంపొందించడంలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తించారు.

ఈ సందర్భంగా డి. విజయానంద్‌ మాట్లాడుతూ.. బీఐఎస్‌ క్లబ్‌ ద్వారా విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలు, వినియోగదారుల హక్కులపై మరింత అవగాహన కల్పించి, సంస్థ లక్ష్యాల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.