BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 06:45 pm
Posted by : K MAHESH

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రివార్డులు అందించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 06:45 PM
23 వీక్షణలు

ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించి ఉద్యమకారుల వివరాలు నమోదు చేయాలి: సంగిశెట్టి క్రిస్టఫర్

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, నవంబర్ 15 (ఎన్ టుడే న్యూస్):

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడంతో పాటు వారికి తగిన గుర్తింపు, రివార్డులు అందించాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంగిశెట్టి క్రిస్టఫర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా సంగిశెట్టి క్రిస్టఫర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వేలాది మంది పోరాట యోధులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించిన అనేకమంది పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొన్నారని, లాఠీ దెబ్బలు తిన్నారని, జైలు జీవితాన్ని గడిపారని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థికంగా కూడా నష్టపోయినవారు ఉన్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి పోరాటం చేసిన ప్రతి ఉద్యమకారుడిని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఉద్యమంలో పాల్గొన్న వారి సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పించడంతో పాటు రివార్డులు అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల త్యాగాలకు తగిన గుర్తింపు లభించినప్పుడే వారి పోరాటానికి గౌరవం దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రజా పోరాటాల్లో ఒకటని క్రిస్టఫర్ పేర్కొన్నారు. అనేకమంది త్యాగాలు, పోరాటాలు, నిర్బంధాలను ఎదుర్కొన్న ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఇంతటి సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ వెనుక ఉద్యమకారుల కృషి మరువలేనిదని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ఇకపై ఆలస్యం చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఉద్యమకారుల వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని సూచించారు. దాని ద్వారా ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలను నమోదు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల సంక్షేమం, గౌరవం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఈ ప్రకటనలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి, ఉపాధ్యక్షుడు కొండాపురం శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ములుగు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.