బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి.. పూల బతుకమ్మలో మహిళల ఐక్యత!
తెలంగాణ
మంచిర్యాల (ఎన్ టుడే న్యూస్): ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మహిళా నాయకురాళ్లతో కలిసి పాల్గొని బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా మహిళా నాయకురాళ్లతో కలిసి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, పూల బతుకమ్మ చుట్టూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వైభవాన్ని చాటిచెప్పారు.
బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ వేడుకలు మరోసారి చాటిచెప్పాయి.