BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 28 March 2026, 01:14 pm
Posted by : V శ్రీనివాస్

తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 01:14 PM
237 వీక్షణలు

తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలి: మంచిర్యాల జిల్లా సమావేశంలో డిమాండ్

తేదీ 28-03-2026 శనివారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చి ఉద్యమ కారులను ఆదుకోవాలని, తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి ప్రతి నెల 50,000 వేల రూపాయిల పెన్షన్ చెల్లించాలని ఈ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ముగియకముందే తెలంగాణ ఉద్యమ కారుల సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యమ కారులు డిమాండ్ చేసినారు.

అదే విధంగా తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని, ఉచితంగా కార్పొరేట్ వైద్య సౌకర్యాలు అందించడానికి హెల్త్ కార్డ్ ను ప్రభుత్వం జారీ చేయాలని, ఉద్యమ కారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డ్స్ జారీ చేయాలని, తొలి దశ మలి దశ ఉద్యమంలో అమరులైన అమరవీరుల కుటుంబాలను అందరినీ తొలి దశ మలి దశ ఉద్యమంలో ఆనాటి సీమాంధ్ర ప్రభుత్వం కేసులు పెట్టి జైళ్ల పాలైన ఆర్ధికంగా, శారీరకంగా నష్టపోయిన ఉద్యమ కారులను ఆదుకోవాలని, లేని యెడల ఉద్యమ కారుల నాయకత్వంలో మరో పోరాటం చేయక తప్పదని ఈ సమావేశం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినది.

ఈ సందర్భంగా జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ, తెలంగాణ ఉద్యమ కారుల ఐక్యత వర్ధిలాలి అని పెద్ద పెట్టున నినాదాలు చేసినారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షులు మురహరి, కార్యదర్శి గంగన్న, నాయకులు కస్తూరి సూర్యం, ఆర్ మోహన్ లాల్, రమేష్, ఎన్ అంజయ్య, పులి కృష్ణ, ఎం రాయమల్లు, రామన్న తదితరులు పాల్గొన్నారు