BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 June 2026, 03:40 pm
Posted by : V శ్రీనివాస్

​తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి: మంత్రి డా.జి.వివేక్ వెంకటస్వామి

తెలంగాణ
/ మంచిర్యాల / మందమర్రి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 03:40 PM
307 వీక్షణలు

మందమర్రిలో జర్మన్ భాషా శిక్షణ కేంద్రం ప్రారంభం

​విదేశీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపు

​మంచిర్యాల ప్రతినిధి: తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్‌లో తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM), ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రివర్యులు డా.జి.వివేక్ వెంకటస్వామి ఘనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విదేశీ భాషలపై ప్రావీణ్యం సాధించడం అత్యంత అవసరమని అన్నారు. ముఖ్యంగా జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నైపుణ్యం కలిగిన యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా దేశాల్లో లభించే అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను తెలంగాణ యువత సద్వినియోగం చేసుకునేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను, శిక్షణా కేంద్రాలను అందుబాటులోకి తెస్తోందని ఆయన స్పష్టం చేశారు.

​TOMCOM సంస్థ ద్వారా కేవలం భాషా శిక్షణే కాకుండా, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శకత్వం మరియు విదేశీ ఉద్యోగాల కల్పన వంటి ఎన్నో ప్రయోజనకరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మందమర్రిలో ప్రారంభమైన ఈ జర్మన్ భాషా శిక్షణ కేంద్రం స్థానిక యువతకు ప్రపంచ స్థాయి అవకాశాల ద్వారాలను తెరుస్తుందని, విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక కీలక వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ యువత ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు