BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 16 August 2026, 10:52 am
Posted by : కూనురు మధు

తెలంగాణలో నిలిచిపోయిన రైతు బీమా

తెలంగాణ
/ హైదరాబాద్
16 Aug, 2026 - 10:52 AM
91 వీక్షణలు

తెలంగాణలో నిలిచిపోయిన రైతు బీమా

తెలంగాణలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతుబీమా పథకం 2026–27 సంవత్సరానికి నిలిచిపోయినట్లు సమాచారం. రైతు అకాల మరణం చెందితే కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)తో కలిసి అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42.16 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీలోగా ప్రభుత్వం రైతుబీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ.1,400 కోట్లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉండగా, 2026–27 సంవత్సరానికి ఇప్పటివరకు ప్రీమియం చెల్లించలేదని ఆరోపణలు వస్తున్నాయి.

ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా ప్రభుత్వం చెల్లింపులు చేపట్టకపోవడంతో రైతుబీమా పథకం భవిష్యత్తుపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. అకాల మరణంతో కుటుంబాన్ని కోల్పోయే రైతు కుటుంబాలకు రైతుబీమా కీలకమైన ఆర్థిక అండగా ఉందని, ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించి పథకాన్ని కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.