BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 09:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు కొత్త నిబంధనలు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 09:58 PM
56 వీక్షణలు

తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు కొత్త నిబంధనలు.. భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రత్యేక వెసులుబాటు

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలతో జీవో విడుదల చేసింది.

కొత్త జీవో ప్రకారం అర్హత కలిగిన భారీ బడ్జెట్ సినిమాలకు నియంత్రిత విధానంలో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు. అలాగే రోజుకు గరిష్ఠంగా ఐదు షోలకు అనుమతి ఇవ్వనున్నారు.

అయితే సాధారణ ప్రేక్షకులపై భారం పడకుండా ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లను నాన్‌-ప్రేమియం కేటగిరీకి కేటాయించాలని స్పష్టం చేసింది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సినిమా చూసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ప్రోత్సాహం లభించడంతో పాటు ఆధునిక సాంకేతికత వినియోగం, చిన్న సినిమాల అభివృద్ధి, సినీ రంగ కార్మికుల సంక్షేమానికి ఊతం లభిస్తుందని తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది.

సినీ పరిశ్రమ అభివృద్ధి, ప్రేక్షకుల ప్రయోజనాలు రెండింటినీ సమతుల్యం చేసేలా కొత్త విధానం రూపొందించామని ప్రభుత్వం తెలిపింది.