BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 14 October 2026, 08:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవన అభివృద్ధికి రూ.50 వేల ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Oct, 2026 - 08:32 PM
313 వీక్షణలు

కార్మికుల సంక్షేమానికి అండగా నిలిచిన చెక్క సెంట్రింగ్ మేస్త్రి ఇమ్మడి కృష్ణ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవన అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందింది. యూనియన్ భవనాన్ని మరింత మెరుగుపరిచి, కార్మికుల సమావేశాలు, సంక్షేమ కార్యక్రమాలకు అనువుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో చెక్క సెంట్రింగ్ మేస్త్రి ఇమ్మడి కృష్ణ రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.

కార్మికుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశ భవనం అవసరమని గుర్తించి, భవన అభివృద్ధి కోసం తన వంతు సహకారంగా ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపారు. బిల్డింగ్ వర్కర్స్ కుటుంబాల సంక్షేమానికి, వారి ఐక్యతకు యూనియన్ భవనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇమ్మడి కృష్ణ అందించిన రూ.50 వేల నగదును తిరువూరు మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వేముల రమేష్ ఏసుకు అందజేశారు. యూనియన్ నాయకులు, సభ్యులు ఇమ్మడి కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ఇలాంటి సహాయాలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని వారు అన్నారు.

కార్మికుల కోసం ఏర్పాటు చేస్తున్న సమావేశ భవనం అభివృద్ధి చెందితే భవిష్యత్‌లో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని యూనియన్ ప్రతినిధులు తెలిపారు.