BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 04:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో విషాదం.. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లి విగతజీవిగా మారిన యువతి వైష్ణవి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 04:18 PM
99 వీక్షణలు

డెలివరీ ఆపరేషన్ అనంతరం 22 ఏళ్ల నాగలక్ష్మి మృతి.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆరోపణలు ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: నిండు నూరేళ్ల జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ యువతి ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లి విగతజీవిగా తిరిగిరావడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే తల్లి మృతి చెందడంతో తిరువూరు పట్టణంలోని వైష్ణవి ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబ సభ్యులు, నూతిపాడు గ్రామస్థులు ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. విస్సన్నపేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మన్నెం నాగలక్ష్మి (22) ప్రసవం నిమిత్తం బుధవారం తిరువూరులోని వైష్ణవి ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ప్రసవం కోసం శస్త్రచికిత్స నిర్వహించగా నాగలక్ష్మి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆపరేషన్ అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని, రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొంటూ మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది సూచించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఈ పరిణామాలపై బాధిత కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నాగలక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న సమయంలో సరైన వైద్యం అందించలేదని, వైద్యానికి సంబంధించిన పూర్తి నివేదికలు, పరీక్షల వివరాలు తమకు అందించకుండా ఆసుపత్రి నుంచి పంపించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే యువతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి వైద్యుల నిర్లక్ష్యం ఉందా, చికిత్సలో ఏవైనా లోపాలు జరిగాయా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధిత కుటుంబం కోరుతోంది. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ, అధికారుల విచారణ వివరాలు తెలియాల్సి ఉంది. వైద్యపరమైన వాస్తవాలు నిర్ధారణ కావాల్సి ఉన్న నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.