BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 07 August 2026, 06:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తమిళనాడు సీఎం విజయ్‌ విడాకుల కేసులో కీలక మలుపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 06:28 PM
121 వీక్షణలు

తమిళనాడు సీఎం విజయ్‌ విడాకుల కేసులో కీలక మలుపు

చెంగల్‌పట్టు: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ దాంపత్య జీవితానికి సంబంధించిన విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్‌ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఆమె తాజాగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేసు విచారణకు తెరపడింది.

విడాకుల కోసం సంగీత చెంగల్‌పట్టు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కొంతకాలంగా కోర్టు పరిధిలో కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో కేసును కోర్టు ముగించింది. దీంతో విజయ్‌-సంగీత దంపతులకు సంబంధించిన విడాకుల వ్యవహారంపై నెలకొన్న న్యాయపరమైన ప్రక్రియ ముగిసినట్లయింది.

కేసు ఉపసంహరణకు సంబంధించిన కారణాలను సంగీత తరఫు నుంచి అధికారికంగా వెల్లడించలేదు. పిటిషన్‌ వెనక్కి తీసుకోవడంతో ఇక ఈ కేసులో తదుపరి విచారణ అవసరం లేదని చెంగల్‌పట్టు జిల్లా కోర్టు స్పష్టం చేస్తూ కేసును ముగించింది.

ఈ పరిణామం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి విజయ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కావడంతో విడాకుల కేసు వ్యవహారం మొదటి నుంచీ ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా భార్య పిటిషన్‌ ఉపసంహరించుకోవడంతో ఈ వ్యవహారానికి తాత్కాలికంగా ముగింపు లభించింది.