ఏపీలో అక్టోబర్ 12 నుంచి దసరా సెలవులు
జాతీయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు దసరా సెలవులను అక్టోబర్ 12 నుంచి 21వ తేదీ వరకు ప్రకటించారు. అయితే అక్టోబర్ 10 రెండో శనివారం, 11 ఆదివారం కావడంతో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచే వరుసగా సెలవులు ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 22వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో సెలవుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి.
ఇక తెలంగాణలో పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు.