BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 08:42 am
Posted by : SEETHA KIRAN KUMAR

ముంబైలో రాకెట్ టపాసుతో 23వ అంతస్తులో అగ్నిప్రమాదం

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
07 Nov, 2026 - 08:42 AM
22 వీక్షణలు

ఘాట్‌కోపర్‌లోని ఉషాకిరణ్ CHS భవనంలో ఘటన.. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

ముంబై (ఎన్ టుడే న్యూస్):

దీపావళి వేడుకల సందర్భంగా ముందస్తుగా టపాసులు కాల్చడంతో ముంబైలోని ఘాట్‌కోపర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంత్‌నగర్‌లోని ఉషాకిరణ్ CHS భవనంలో ఒకరు కాల్చిన రాకెట్ టపాసు నేరుగా భవనంలోని 23వ అంతస్తులోకి దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి.

దీపావళి పండుగ 8వ తేదీన జరగాల్సి ఉండగా, కొందరు ముందుగానే బాణసంచా కాల్చడం ప్రారంభించారు. ఈ క్రమంలో పంత్‌నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి రాకెట్ టపాసు కాల్చగా, అది ఉషాకిరణ్ CHS భవనంలోని 23వ అంతస్తులోకి వెళ్లి పడినట్లు సమాచారం. దీంతో ఆ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించి, కొద్దిసేపటికే మంటలు విస్తరించాయి.

అగ్నిప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో భవనంలోని నివాసితులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఆస్తి నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.