BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 08:39 am
Posted by : SEETHA KIRAN KUMAR

నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభం

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
07 Nov, 2026 - 08:39 AM
28 వీక్షణలు

అధికారిక అరెస్టు తేదీతో సంబంధం లేదు.. రాజ్యాంగంలోని హక్కులను తప్పనిసరిగా పాటించాలి: సుప్రీంకోర్టు

(ఎన్ టుడే న్యూస్):

నిందితుడిని పోలీసులు వాస్తవంగా నిర్బంధించిన సమయం నుంచే 24 గంటల గడువును లెక్కించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధికారికంగా అరెస్టు చేసినట్లు నమోదు చేసిన సమయం నుంచే గడువు ప్రారంభమవుతుందని భావించడానికి వీల్లేదని పేర్కొంది. ఒక నేరంలో అనుమానంతో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే రాజ్యాంగం నిర్దేశించిన 24 గంటల గడువు వర్తిస్తుందని తెలిపింది.

నిర్బంధం, అధికారిక అరెస్టు మధ్య తేడాను చూపిస్తూ గడువును పొడిగించే ప్రయత్నం రాజ్యాంగపరమైన హక్కులకు విరుద్ధమని కోర్టు పేర్కొన్నట్లు సమాచారం. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ హక్కులను కాపాడటంలో ఈ నిబంధన కీలకమని స్పష్టం చేసింది.

పోలీసులు నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లోగా సంబంధిత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి. ఈ గడువును ఉల్లంఘించినట్లు తేలితే, చట్టప్రకారం ఆ వ్యక్తిని వెంటనే విడుదల చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడిని తమ ఎదుట హాజరుపరిచినప్పుడు పోలీసులు నిర్బంధించిన వాస్తవ సమయం, అరెస్టు నమోదు చేసిన సమయం, చట్టబద్ధమైన గడువు పాటించారా లేదా అనే అంశాలను మేజిస్ట్రేట్ పరిశీలించాలని పేర్కొంది.

ఈ స్పష్టీకరణ పోలీసుల నిర్బంధ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడంతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన రక్షణను బలోపేతం చేసే అంశంగా ప్రాధాన్యత సంతరించుకుంది.