BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 05:16 pm
Posted by : PAGADALA DEVAIAH

పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
20 Nov, 2026 - 05:16 PM
29 వీక్షణలు

చందుపట్ల రమణపై దాడిని ఖండిస్తూ వనస్థలిపురంలో కార్మికుల నిరసన

ఎల్బీనగర్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న దళిత మహిళ చందుపట్ల రమణపై దాడికి పాల్పడిన నిందితుడు బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ వనస్థలిపురంలోని శ్రీ వెంకటరమణ కాలనీ చౌరస్తాలో కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆలేటి ఎల్లయ్య, కార్యదర్శి పారానంది శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న చందుపట్ల రమణ (45)పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వారి వివరాల ప్రకారం.. విధుల్లో భాగంగా రమణ చెత్త సేకరిస్తున్న సమయంలో ట్రాక్టర్‌పై నిలబడి చెత్తను అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఇసుకతో నిండిన బస్తాను పైకి ఎత్తలేకపోవడంతో బాలకృష్ణ అనే వ్యక్తి ఆగ్రహానికి గురై కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించారు. అనంతరం సెంట్రింగ్ కర్రతో ఆమె కాళ్లపై దాడి చేశాడని తెలిపారు. పక్కనే ఉన్న ప్రజలు అడ్డుకున్నప్పటికీ తిరిగి దాడికి ప్రయత్నించాడని పేర్కొన్నారు.

రోజువారీ కూలీ పనిపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న పేద మహిళపై ఇలాంటి దాడికి పాల్పడటం అమానవీయమని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల చిన్నచూపు కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు అభిప్రాయపడ్డారు. బాధితురాలిని నిందితుడి తల్లి కూడా దుర్భాషలాడినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు దూషణలకు పాల్పడిన వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం, భద్రత కల్పించి న్యాయం చేయాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు ఎల్లమ్మ, అరుణ, సుగుణమ్మ, ధనమ్మ, సీతమ్మ, రమేష్, శ్రీను, మహేష్, బుచ్చమ్మ, అంజమ్మ, లక్ష్మీదేవి, రమణమ్మ, పకీరమ్మ తదితరులు పాల్గొన్నారు.