BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం
Date of Publish : 06 September 2025, 11:12 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సాధారణ వ్యక్తిగా ముఖ్యమంత్రి

తెలంగాణ
06 Sep, 2025 - 11:12 PM
294 వీక్షణలు
సాధారణ వ్యక్తిగా ముఖ్యమంత్రి NTODAY NEWS: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో సాధారణ వ్యక్తిగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఒక సామాన్యుడిలా వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో సాదాసీదాగా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల మధ్య చేరిపోయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.గణపతి బొప్పా..మోరియా అంటూ పెద్ద ఎత్తున భక్తుల నినాదాలు మారుమోగుతున్న వేళ ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కి అశేషంగా తరలివచ్చిన భక్తులకు అభివాదం చేశారు.అదే క్రమంలో క్రేన్ నంబర్ 4 వద్దకు వెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఉదయం నుంచే శోభాయాత్ర ప్రారంభమై ఒక్కొక్కటిగా గణపతులు ట్యాంక్‌బండ్ తరులుతుండగా, సాయంత్రానికి మహా గణపతి శోభాయాత్ర ఊపందుకుంది.ఆ సమయంలో ఒక సాధారణ వ్యక్తిలా ముఖ్యమంత్రి ఆ మహా జనంలో కలిసిపోయి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో కరచాలనం చేస్తూ ముందుకు నడిచారు. హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ (పీవీ మార్గ్) లో నిరాటంకంగా సాగుతున్న నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లలో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అదే స్ఫూర్తితో పని చేయాలని చెప్పారు. Follow us on Website Facebook Instagram YouTube