BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 23 June 2026, 04:44 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేత: ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ నేత విజిత్ కుమార్

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jun, 2026 - 04:44 PM
162 వీక్షణలు

​మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మార్కెట్ ఏరియాలో మున్సిపల్ అధికారులు, పోలీసులు అకస్మాత్తుగా చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్య చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ షాపులను నిర్దాక్షిణ్యంగా తొలగించారని మల్లేశ్ అనే స్థానిక వ్యాపారి కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఏళ్లుగా అదే స్థలంలో వ్యాపారం చేసుకుంటూ పొట్టతిప్పలు పడుతున్నామని, స్థల యజమాని అనుమతి ఉన్నప్పటికీ తమ జీవనాధారాన్ని దెబ్బతీశారని, ఈ ప్రక్రియలో లక్షలాది రూపాయల విలువైన సామాగ్రి నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే తమను ఆదుకోవాలని కోరారు.

​మరోవైపు ఈ అకస్మాత్తు కూల్చివేతలపై బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ప్రోద్బలంతోనే అధికారులు ఈ అనాలోచిత చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కూల్చివేత జరిగిన ప్రాంతాన్ని స్వయంగా సందర్శించిన ఆయన, సర్వస్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, బాధితుల పక్షాన అవసరమైతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని విజిత్ కుమార్ అధికారులను హెచ్చరించారు