BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
23 Jun, 2026 - 02:51 PM
74 వీక్షణలు

ధర్మపురిలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసుల ప్రారంభం

​- ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

​ధర్మపురి, జూన్ 23:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్టీసీని లాభాల బాట పట్టించేలా సహకరించాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. మంగళవారం ధర్మపురి బస్టాండ్ ఆవరణలో నూతన బస్సు సర్వీసులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

​భక్తులు, విద్యార్థుల సౌకర్యార్థం..

ధర్మపురి శ్రీలక్ష్మీ నర్సింహాస్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చే వేలాది మంది భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

​నిర్మల్ – ధర్మపురి రూట్: నిర్మల్ నుంచి దస్తురాబాద్, కడెం, ఖానాపూర్ మీదుగా ధర్మపురికి ఎక్స్‌ప్రెస్ బస్సు సౌకర్యం కల్పించారు. ఇది రోజుకు రెండు ట్రిప్పుల చొప్పున రాకపోకలు సాగిస్తుంది.

​జగిత్యాల – ధర్మపురి – కరీంనగర్ రూట్: జగిత్యాల నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి ధర్మపురి, రాయపట్నం, వెల్గటూర్, ధర్మారం, చొప్పదండి మీదుగా కరీంనగర్ చేరుకునేలా కొత్త సర్వీసును ప్రారంభించారు. ఇది విద్యార్థులకు, ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

​ప్రత్యేక సౌకర్యం: కరీంనగర్ నుంచి రాత్రి 9 గంటలకు ధర్మపురికి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

​నియోజకవర్గంలో 11 కొత్త రూట్లు

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సహకారంతో ధర్మపురి నియోజకవర్గంలో మొత్తం 11 కొత్త రూట్లలో బస్సులను నడిపేందుకు అనుమతి సాధించామని మంత్రి అడ్లూరి వెల్లడించారు. నియోజకవర్గంలోని విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తుందని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, నాయకులు వేముల రాజు, ప్రజాప్రతినిధులు, జగిత్యాల డిపో మేనేజర్ రమేష్, నిర్మల్ డిపో మేనేజర్ పండరి తదితరులు పాల్గొన్నారు.