BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 23 June 2026, 12:29 pm
Posted by : గడ్డమీది రమేష్

కోహెడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా శెట్టి సుధాకర్ నియామకం

తెలంగాణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
23 Jun, 2026 - 12:29 PM
198 వీక్షణలు
కోహెడ | సిద్దిపేట జిల్లా | ntodaynews.com 

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా వింజపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శెట్టి సుధాకర్ నియమితులయ్యారు.

హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ నియామకాన్ని చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు ఈ నియామకం జరిగినట్లు సమాచారం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శెట్టి సుధాకర్ నియామకాన్ని ఖరారు చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శెట్టి సుధాకర్‌కు అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో కోహెడ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

శెట్టి సుధాకర్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ శ్రేణులందరినీ సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తానని పేర్కొన్నారు.