BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 23 June 2026, 12:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం.. విద్యుత్ పరికరాలకు భారీ నష్టం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 12:04 PM
110 వీక్షణలు

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడీ గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన పిడుగు ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కోల రాములు ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు పూర్తిగా దగ్ధమైంది.

పిడుగు పడిన సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు.

అయితే పిడుగు ప్రభావంతో సమీపంలోని ఇళ్లలో సుమారు పది ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు సహా పలు విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో బాధితులు గణనీయమైన ఆస్తి నష్టాన్ని ఎదుర్కొన్నారు.

ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని కోరుతున్నారు.