BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 June 2026, 12:05 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాలలో చిరు వ్యాపారుల షెడ్ల కూల్చివేత: ఉపాధి కోల్పోయామంటూ బాధితుల ఆవేదన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jun, 2026 - 12:05 PM
154 వీక్షణలు

మంచిర్యాల బస్టాండ్, మార్కెట్ రోడ్ పరిసరాల్లో చిరు వ్యాపారులు దశాబ్దాలుగా ఏర్పాటు చేసుకున్న షెడ్లను ఏసీపీ ప్రకాశ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు మంగళవారం జేసీబీలతో కూల్చివేశారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, కనీసం వస్తువులు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా ఒక్కసారిగా తమ ఉపాధిని లాగేసుకున్నారని బాధిత వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ చర్యతో పదుల సంఖ్యలో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

​అయితే, వ్యాపారుల ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ అన్వేష్ స్పందిస్తూ.. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ముందుగానే హెచ్చరికలు జారీ చేసి, నోటీసులు కూడా అందజేశామని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో ఈ షెడ్ల వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతున్నందునే నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు