BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 02:02 pm
Posted by : PEDDABOINA SRIKANTH

విద్యారంగ సంస్కరణలపై సీఎం విద్యార్థి సంఘాలతో చర్చించాలి

తెలంగాణ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
15 Nov, 2026 - 02:02 PM
22 వీక్షణలు

ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే నిర్ణయంపై స్పష్టత ఇవ్వాలి.. ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వ విద్యకు నష్టం కలిగే ప్రమాదం: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్

హనుమకొండ, నవంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న విద్యా సంస్కరణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విద్యారంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత వర్గాలతో చర్చించడం అవసరమని స్పష్టం చేశారు.

ఆదివారం హనుమకొండ జిల్లా ఏఐఎస్ఎఫ్ సమితి సమావేశం బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి ప్రణీత్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితులు, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సంస్కరణలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు అంశాలను ప్రస్తావించారు.

రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నప్పటికీ విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, మరోవైపు ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయనున్నట్లు ప్రకటించడం విద్యార్థుల్లో గందరగోళానికి కారణమవుతోందని అన్నారు.

ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై ఎలాంటి విస్తృత చర్చ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ విద్యను కూడా పాఠశాల విద్యలో విలీనం చేస్తే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాల్లో ఏ తరగతుల నిర్వహణ ఉంటుంది? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులను ఏ విధంగా నిర్వహిస్తారు? ఒకే ప్రాంగణంలో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు బోధన చేపడితే ఉపాధ్యాయులు, అధ్యాపకుల అర్హతలు, నియామకాలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు. సరైన ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల నియామకాలు లేకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ విద్యావ్యవస్థకు నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు విధానం ఎలా ఉండబోతోందో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. ఈ పాఠశాలల ఏర్పాటు తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణ ఎలా ఉంటుందనే సందేహాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్నాయని తెలిపారు. ఈ అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని కోరారు.

విద్యా కమిషన్ నివేదికను అమలు చేయాలి

తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టడం, విద్యారంగానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించడం, ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడం వంటి కీలక సూచనలు చేసిందని పుట్ట లక్ష్మణ్ గుర్తుచేశారు. అయితే ఆ నివేదికను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచి నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నప్పటికీ విద్యార్థి సంఘాలతో ఒక్కరోజు కూడా సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించకపోవడం విచారకరమని అన్నారు.

విద్యారంగంలో తీసుకురాబోయే సంస్కరణలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉండాలని, వాటిపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే విద్యార్థి సంఘాలకు అపాయింట్‌మెంట్ ఇచ్చి విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భాషబోయిన సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్, శ్రీపతి వినయ్, వేల్పుల చరణ్, కొండ చరణ్, జిల్లా సహాయ కార్యదర్శులు సాయి గౌడ్, వంశీ, నాగరాజ్, శ్రీహర్ష, జిల్లా సమితి సభ్యులు రామ్ చరణ్, రణధీర్, సునీల్, హర్షతో పాటు వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.