BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:35 pm
Posted by : BAYYAVARAPU NAGARAJU

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Bayyavarapu Nagaraju Pedakurapadu Constituency
10 Oct, 2026 - 09:35 PM
9 వీక్షణలు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

పెదకూరపాడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. నియోజకవర్గంలోని బీసీ నాయకులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించి, బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించడం, వారి హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. బీసీల రాజకీయ అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం తన వైఖరికి అనుగుణంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

బీసీల అభివృద్ధి, రాజకీయ భాగస్వామ్యం పెంపొందించే అంశాలపై సమావేశంలో నాయకులు చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు.