BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:33 pm
Posted by : MUSUGU GOPI

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
10 Oct, 2026 - 09:33 PM
1 వీక్షణలు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

పెదకూరపాడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం, రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించే అంశాలపై పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలోని బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.

కోర్టు తీర్పులు అనుకూలంగా లేకపోయినా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో తమ పార్టీ కట్టుబడి ఉందని భాష్యం ప్రవీణ్ అన్నారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడం, వారి హక్కులను పరిరక్షించడం, రాజకీయ అభ్యున్నతికి తోడ్పడడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించేలా కృషి చేస్తామని, ఈ విషయంలో బీసీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, బీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.