BREAKING
thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక
Date of Publish : 06 October 2026, 06:45 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరద ముంపునకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
06 Oct, 2026 - 06:45 PM
8 వీక్షణలు

57వ డివిజన్‌లో రూ.2.52 కోట్లతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్‌లో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సమ్మయ్యనగర్, గోకుల్‌నగర్ ప్రాంతాల్లో రూ.2.52 కోట్ల నిధులతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులను ఎలాంటి జాప్యం లేకుండా ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా గోకుల్‌నగర్, సమ్మయ్యనగర్‌తో పాటు పరిసర కాలనీల్లో ప్రతి వర్షాకాలంలో తలెత్తుతున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

రెండు వైపుల నుంచి వచ్చే వరద నీటితో ముంపు

అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వర్షపు నీరు, సుబేదారి పోలీస్ స్టేషన్ వైపు నుంచి వచ్చే నీరు గోకుల్‌నగర్ చౌరస్తా వద్ద కలవడంతో వర్షాకాలంలో గోకుల్‌నగర్‌తో పాటు పరిసర కాలనీలు నీట మునిగే పరిస్థితి ఏర్పడుతోందని ఎమ్మెల్యే వివరించారు.

ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సమగ్ర డ్రైనేజీ వ్యవస్థతో పాటు అవసరమైన రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వర్షాలు వచ్చిన ప్రతిసారీ ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు.

రోడ్డు విస్తరణకు రూ.18 కోట్లు

అంబేద్కర్ విగ్రహం నుంచి వడ్డేపల్లి చర్చి వరకు రోడ్డు విస్తరణ కోసం సుమారు రూ.18 కోట్ల నిధులు మంజూరైనట్లు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, రెండు రోజుల్లో టెండర్ ఓపెన్ చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

రోడ్డు విస్తరణతో పాటు గోకుల్‌నగర్, వడ్డేపల్లి చౌరస్తాలను సుందరీకరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో పెరుగుతున్న జనాభా, వాహనాల రాకపోకలకు అనుగుణంగా మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

అభివృద్ధి పనులకు సహకరించాలి

రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనుల విషయంలో దుకాణదారులు, ఇళ్ల యజమానులు ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల సమయంలో కొంతమేర ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తు తరాలకు మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అందించేందుకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి పనులు చేపడతామని చెప్పారు. వ్యక్తిగత సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే ప్రజలందరికీ ఉపయోగపడే అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దని సూచించారు.

గోకుల్‌నగర్, సమ్మయ్యనగర్, పరిసర కాలనీల ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీ, రోడ్డు విస్తరణ, చౌరస్తాల సుందరీకరణ పనులను సమన్వయంతో పూర్తి చేసి 57వ డివిజన్‌ను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.