BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 06:07 pm
Posted by : K MAHESH

9 క్యారెట్ల బంగారానికి పెరుగుతున్న ఆదరణ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 06:07 PM
17 వీక్షణలు

పెరుగుతున్న పసిడి ధరల నేపథ్యంలో తక్కువ బడ్జెట్ ఆభరణాలపై వినియోగదారుల ఆసక్తి

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో సామాన్యులు ప్రత్యామ్నాయంగా 9 క్యారెట్ల బంగారం ఆభరణాలపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ధరకు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో వీటికి ఆదరణ పెరుగుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.31 లక్షల వరకు ఉండగా, 9 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.54 వేలుగా ఉందని పేర్కొంటున్నారు. ధరల్లో వ్యత్యాసం కారణంగా తక్కువ బడ్జెట్‌లో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి 9 క్యారెట్ల బంగారం ఒక ప్రత్యామ్నాయంగా మారుతోంది.

ముఖ్యంగా హాల్‌మార్కింగ్‌తో కూడిన 9 క్యారెట్ల ఆభరణాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎక్కువ బరువుతో ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించిన వారు సైతం ప్రస్తుతం తమ బడ్జెట్‌కు అనుగుణంగా తక్కువ బరువున్న ఆభరణాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం. మూడు తులాల ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారు కూడా 4 నుంచి 10 గ్రాముల మధ్య బరువున్న ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే 9 క్యారెట్ల బంగారంలో స్వచ్ఛమైన బంగారం శాతం 22 క్యారెట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అందువల్ల కొనుగోలు చేసే ముందు క్యారెట్ వివరాలు, హాల్‌మార్కింగ్, ధర, తయారీ ఛార్జీలను పరిశీలించాలని వినియోగదారులకు సూచిస్తున్నారు.