BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 08:27 pm
Posted by : K MAHESH

నల్లగొండలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:27 PM
18 వీక్షణలు

రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య పిలుపు

బహిరంగ సభకు మద్దతుగా రామన్నపేటలో బైక్ ర్యాలీ

రామన్నపేట (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7:

రైతాంగ సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ పరిరక్షణ, రైతుల హక్కుల సాధన కోసం అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో ఈ నెల 15న నల్లగొండలో నిర్వహించనున్న 36వ జాతీయ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

జాతీయ మహాసభల బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుతూ శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రామన్నపేట పట్టణ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురావాలని వారు కోరారు. సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడంతో పాటు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు.

దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసే వేదికగా అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. రైతాంగ హక్కుల సాధన, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం జరిగే ఈ మహాసభల బహిరంగ సభకు రైతులు, కూలీలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నల్లగొండకు తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్, రైతు సంఘం మండల అధ్యక్షుడు బోయిని ఆనంద్, కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, నాయకులు కందుల హనుమంతు, ప్రజాసంఘాల నాయకులు బావండ్లపల్లి బాలరాజు, తొలుపునూరి శ్రీనివాస్, నీల అయిలయ్య, గంటెపాక శివకుమార్, మేడి ముకుంద, దుబ్బాక సర్పంచ్ గట్టు నర్సింహా, అవనగంటి నగేష్, తాళ్లపల్లి జితేందర్, శానగొండ వెంకటేశ్వర్లు, మెట్టు శ్రవణ్, పుట్టల ఉదయ్ కుమార్, జోగుల శ్రీనివాస్, అవనగంటి శ్రీనివాస్, రైతులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.