BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 05:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పడమర మాధవరంలో పత్తి రైతుల కన్నీటి వ్యథ..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 05:29 PM
124 వీక్షణలు

ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు తుఫాన్లు, ఎల్‌నినో ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి – అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, ఏ.కొండూరు మండలం పడమర మాధవరం గ్రామ పరిధిలోని ఎల్‌ఐజీ తండాలో పత్తి సాగు చేస్తున్న గిరిజన రైతుల కష్టాలు క్షేత్రస్థాయిలో వెలుగులోకి వచ్చాయి. పత్తి సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టినా ప్రకృతి వైపరీత్యాల దెబ్బకు ఆశించిన దిగుబడి రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ తండాలోని పత్తి పంట పొలాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సాగు కష్టాలను, పెట్టుబడి నష్టాలను ఆయనకు వివరించారు. పత్తి సాగు కోసం ఒక్కో రైతు లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టడంతో పాటు పంటకు అవసరమైన నీటిని సైతం డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశామని తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుతం ఎకరాకు కనీసం మూడు క్వింటాళ్ల పత్తి దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో ప్రభావం కారణంగా పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించకపోవడం దురదృష్టకరమని హరినాథ్ విమర్శించారు. ఎన్నికల వ్యవహారాల్లో నిమగ్నమైన అధికారులు రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. పంట నష్టంపై ఇప్పటివరకు సరైన నమోదు ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల బాధిత రైతులకు పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా పంట నష్టాన్ని సమగ్రంగా సర్వే చేసి నష్ట వివరాలను అధికారికంగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం రూ.50 వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంటలు ప్రకృతి ప్రకోపానికి బలైతే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే బాధిత రైతులను సమీకరించి ప్రజా ఆందోళన చేపడతామని హరినాథ్ హెచ్చరించారు. ఈ పర్యటనలో పి. గోవిందు, హరిచంద్ తదితరులు పాల్గొని రైతుల పంట పొలాలను పరిశీలించారు

.