BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 09 October 2026, 08:38 am
Posted by : THALLAPALLI LAKSHMANA

మార్కాపురం జిల్లాలో భారీ చోరీ :

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
09 Oct, 2026 - 08:38 AM
13 వీక్షణలు

అర్ధవీడు: మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మావుటూరు గ్రామంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లిన సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి బంగారం, నగదును అపహరించారు.

గ్రామానికి చెందిన ఆవులయ్య ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. గురువారం ఆయన భార్యతో కలిసి పొలానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.

అనంతరం బీరువాలో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.లక్ష నగదును అపహరించినట్లు సమాచారం. పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఆవులయ్య చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.