BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:25 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
10 Oct, 2026 - 09:25 PM
8 వీక్షణలు

ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ: తమ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు తావివ్వదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎక్కడా తప్పుడు కేసులు నమోదు చేయలేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శనివారం ఆళ్లగడ్డలో మీడియాతో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో తమపై కేసులు నమోదైనప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ రాజకీయ కక్షతో వేధించలేదని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలు సహజమని, పాలనలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని భూమా అఖిలప్రియ చెప్పారు. చేసిన పనులను వివరించి ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతామని పేర్కొన్నారు.