BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:23 pm
Posted by : K MAHESH

అడ్డగూడూరు గురుకుల పాఠశాల ఘటనకు బాధ్యులైన వారిని శాశ్వతంగా తొలగించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / అడ్డగూడూరు
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:23 PM
12 వీక్షణలు

టీ.వీ.ఎన్.ఎస్. వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ మహారాజ్ డిమాండ్

కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం

యాదాద్రి భువనగిరి జిల్లా, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెంలోని బాలికల గురుకుల పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనకు బాధ్యులైన వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని తెలంగాణ విద్యార్థి నవ నిర్మాణ సమితి (టీవీఎన్ఎస్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ మహారాజ్ డిమాండ్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి వంట మనిషి వెంకన్న, బాలికల వేధింపుల విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపిస్తున్న ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి, పాఠశాల అటెండర్ పూలమ్మ, కాంట్రాక్టర్ పనులు నిర్వహించే సోమయ్య, మధులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని కోరారు.

శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నరేందర్ మహారాజ్ మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ ఝాన్సీరాణిపై అనేక ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే తెలంగాణ విద్యార్థి నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.