ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టులో పదోన్నతి
తెలంగాణ
/
హైదరాబాద్
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సహా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌తో పాటు గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలకు సుప్రీంకోర్టులో పదోన్నతి లభించింది.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఈ నియామకాలు జరిగినట్లు తెలుస్తోంది. నూతన నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరగనుంది.