BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం
Date of Publish : 06 October 2026, 01:01 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సిద్దిపేట జిల్లాలో ముగ్గురు జూనియర్ లెక్చరర్లపై వేటు

తెలంగాణ
/ సిద్దిపేట
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
06 Oct, 2026 - 01:01 PM
4 వీక్షణలు

సిద్దిపేట: నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలు సమర్పించినట్లు నిర్ధారణ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా 35 మంది ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు తీసుకుంది. వీరి నియామకాలను రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ముగ్గురు జూనియర్ లెక్చరర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ ఎం.డి. అష్రఫ్ హుస్సేన్, చేర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ పరశురాములు ల్యాగల, చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ జి. ప్రసాద్పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో గతంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన జూనియర్ లెక్చరర్లను 2023లో రెగ్యులరైజ్ చేశారు. ఈ ప్రక్రియలో సమర్పించిన విద్యార్హత ధ్రువపత్రాలపై అనుమానాలు రావడంతో ఇంటర్మీడియట్ విద్యాశాఖ వాటిని సంబంధిత విశ్వవిద్యాలయాలకు పంపి పరిశీలించింది. కొంతమంది లెక్చరర్లు సమర్పించిన పీజీ, బీటెక్ తదితర ధ్రువపత్రాలు ఆయా విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావని నిర్ధారణ కావడంతో చర్యలకు శ్రీకారం చుట్టింది.

ధ్రువపత్రాలపై అనుమానాలు ఉన్న లెక్చరర్లకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. వచ్చిన వివరణలను పరిశీలించిన అనంతరం సంతృప్తికరంగా లేవని తేలిన వారిపై నియామకాలను రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు జూనియర్ లెక్చరర్ల విద్యార్హత ధ్రువపత్రాలపైనా పరిశీలన కొనసాగుతున్నట్లు సమాచారం. దాదాపు 320 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లను సంబంధిత విశ్వవిద్యాలయాల ద్వారా వెరిఫికేషన్ చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.