BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:25 PM
30 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం పోతనపల్లి అటవీ ప్రాంతంలోని పోలవరం గండి చెరువు సమీపంలో పులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పులి కదలికలకు సంబంధించిన సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతంలో పులి సంచారంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, రాత్రంతా దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోతనపల్లి, పోలవరం పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప ఒంటరిగా అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని హెచ్చరించారు. వ్యవసాయ పనులు, పశువుల మేత కోసం అడవుల సమీప ప్రాంతాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వదలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లలను అడవుల సమీప ప్రాంతాలకు ఒంటరిగా పంపించవద్దని సూచించారు. పులి అడుగుజాడలు కనిపించినా, పులి సంచారం గుర్తించినా దాని సమీపానికి వెళ్లడం, ఫొటోలు లేదా వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం చేయరాదని స్పష్టం చేశారు. పులి కనిపించిన వెంటనే లేదా దాని కదలికలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు గుంపులుగా వెళ్లి పులిని వెంబడించడం, దానిని తరిమే ప్రయత్నం చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని సూచించారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల రక్షణను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎవరూ భయాందోళనలకు గురికాకుండా అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.