BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:21 pm
Posted by : K MAHESH

పిల్లల్లో పోషకాహార లోప నివారణకే ‘తొలిముద్ద’ కార్యక్రమం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:21 PM
12 వీక్షణలు

నైనాల అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ యాసం సంధ్యా రమేష్

నెల్లికుదురు, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని నైనాల గ్రామ సర్పంచ్ యాసం సంధ్యా రమేష్ తెలిపారు.

శుక్రవారం నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రీ-స్కూల్ పిల్లలకు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాలతో కూడిన అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. ఉప్మా, కిచిడీ వంటి ఆహార పదార్థాలను అందించడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న పోషక విలువలు కలిగిన బాలామృతాన్ని తల్లిదండ్రులు పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పదార్థాలను సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుధ, అంగన్వాడీ టీచర్లు శివలింగేశ్వరమ్మ, హైమ, మాజీ టీచర్ లక్ష్మీనరసమ్మ, పిల్లలు, తల్లులు, గర్భిణులు పాల్గొన్నారు.