పాకల బీచ్ లో ఏడుగురు గల్లంతు :
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
ప్రకాశం జిల్లా: పాకల బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన వారిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. సముద్రంలో గల్లంతైన వారిని రక్షించేందుకు మెరైన్ సిబ్బంది చర్యలు చేపట్టారు.
కనిగిరి నియోజకవర్గంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు పోలేరమ్మ కొలుపుల సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం.
వారిలో ఐదుగురిని మెరైన్ సిబ్బంది రక్షించగా, ఇద్దరు మృతి చెందినట్లు తెలిసింది. రక్షించిన వారిలో ముగ్గురికి కందుకూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, ప్రమాదానికి గల కారణాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.