BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:45 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పాకల బీచ్‌లో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
10 Oct, 2026 - 09:45 PM
9 వీక్షణలు
  • పోలేరమ్మ జాతర అనంతరం సముద్ర స్నానానికి..
  • మృతులు, గల్లంతైన వారి వివరాలు
  • ఘటనాస్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
  • బీచ్‌కు వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలి

మరో ఇద్దరు గల్లంతు.. ముగ్గురికి ఆసుపత్రిలో చికిత్స

ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్‌లో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన వారిపై అలలు విరుచుకుపడటంతో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురిని స్థానిక మత్స్యకారులు, పోలీసులు రక్షించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన సుమారు 70 మంది తమ ఆచారం ప్రకారం పోలేరమ్మ జాతర నిర్వహించుకున్న అనంతరం సముద్ర స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. వారిలో కొందరు సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద అల రావడంతో పలువురు సముద్రంలోకి కొట్టుకుపోయినట్లు బృంద సభ్యులు వివరించారని పేర్కొన్నారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. పడవల సహాయంతో సముద్రంలో చిక్కుకున్న వారిలో కొందరిని రక్షించారు. అయినప్పటికీ ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. రక్షించిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.

ఈ ప్రమాదంలో పాలడుగు తేజ (20), బత్తుల మహేష్ బాబు (22) మృతి చెందారు. దేవండ్ల విష్ణు, దేవండ్ల నారాయణ ఆచూకీ లభించాల్సి ఉంది. మనోజ్ కుమార్, మహేష్ తేజ, నరసింహ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పాకల బీచ్‌ను సందర్శించారు. ఘటన జరిగిన తీరును పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

గల్లంతైన వారి కోసం పోలీసు యంత్రాంగం, ఇతర సిబ్బంది డ్రోన్లు, పడవల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. బాధిత కుటుంబాలకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రమాదంలో గాయపడిన వారికి ఒంగోలు జీజీహెచ్, కందుకూరు కోటారెడ్డి ఆసుపత్రి, ఒంగోలులోని రమేష్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం కందుకూరు కోటారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నరసింహ ఆరోగ్యం మెరుగుపడిందని, ప్రస్తుతం ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు వెల్లడించారు.

ఈ పర్యటనలో కందుకూరు సబ్‌ కలెక్టర్ డి. హిమవంశీ, కందుకూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

సముద్ర స్నానానికి వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని, అలల ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. భద్రత కోసం పోలీసులు చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ ఘటనతో శ్రీరంగాపురం గ్రామంలో విషాదం నెలకొంది.