BREAKING
thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి
Date of Publish : 06 October 2026, 07:19 pm
Posted by : కూనురు మధు

నాగార్జునసాగర్‌లో జర్నలిస్టులకు ఏఐ సోషల్ మీడియాపై శిక్షణ

తెలంగాణ
/ నల్గొండ
06 Oct, 2026 - 07:19 PM
23 వీక్షణలు

జర్నలిస్టులకు ఏఐ, సోషల్ మీడియాపై ప్రత్యేక శిక్షణ

ఈ నెల 12న నాగార్జునసాగర్‌లో వర్క్‌షాప్‌.. 75 మందికి అవకాశం

నల్గొండ, ఎన్‌టుడే న్యూస్‌: నాగార్జునసాగర్‌లో ఈ నెల 12న జర్నలిస్టులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), సోషల్‌ మీడియా వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్‌. వెంకటేశ్వరరావు తెలిపారు.

హిల్‌కాలనీలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్‌షాప్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. వర్కింగ్‌ జర్నలిస్టులకు ఏఐ, సోషల్‌ మీడియా వినియోగంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నిపుణులతో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

జర్నలిజం రంగంలో సాంకేతికత వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏఐ, డిజిటల్‌ సాధనాలపై అవగాహన జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వార్తల సేకరణ, కంటెంట్‌ తయారీ, సోషల్‌ మీడియా వినియోగంలో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

శిక్షణకు హాజరయ్యే జర్నలిస్టులు ఈ నెల 8వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. నల్గొండ కలెక్టరేట్‌లోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

వర్క్‌షాప్‌లో గరిష్ఠంగా 75 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్‌తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్‌. వెంకటేశ్వరరావు కోరారు.