BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 06:50 pm
Posted by : K MAHESH

రైతుల సహకారంతోనే పారదర్శకంగా భూ రీసర్వే

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 06:50 PM
14 వీక్షణలు

సర్వే సమయంలో రైతులు పొలాల వద్ద అందుబాటులో ఉండాలి: తహసీల్దార్ చప్పిడి నాగరాజు

బయ్యారం, నవంబర్ 11:

భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేసి, భవిష్యత్తులో భూ సరిహద్దులు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రైతులు పూర్తి సహకారం అందించాలని బయ్యారం తహసీల్దార్ చప్పిడి నాగరాజు కోరారు.

మండలంలోని సింగారం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను ఉద్దేశించి తహసీల్దార్ మాట్లాడుతూ.. సర్వే నిర్వహించే సమయంలో రైతులు తప్పనిసరిగా తమ తమ పొలాల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు. సర్వే సిబ్బందికి తమ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడంతో పాటు, భూముల సరిహద్దులను గుర్తించేందుకు సహకరించాలని కోరారు.

భూ రీసర్వేలో భాగంగా ప్రతి రైతుకు సంబంధించిన భూముల విస్తీర్ణం, సరిహద్దులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల భూములకు సంబంధించిన రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

భూ రీసర్వే విజయవంతం కావడంలో రైతుల భాగస్వామ్యం కీలకమని, సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించడం ద్వారా భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రీసర్వే భవిష్యత్తులో భూ తగాదాలు, సరిహద్దు వివాదాలు తలెత్తకుండా నివారించేందుకు ఎంతగానో దోహదపడుతుందని తహసీల్దార్ చప్పిడి నాగరాజు తెలిపారు.