BREAKING
thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ
Date of Publish : 06 October 2026, 03:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యుత్‌ వినియోగదారులపై రూ.5,420 కోట్ల ట్రూ-అప్‌ భారం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 03:11 PM
9 వీక్షణలు

హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులపై ప్రభుత్వం రూ.5,420.23 కోట్ల ట్రూ-అప్‌ ఛార్జీల భారాన్ని మోపింది. నవంబర్‌ నెల కరెంట్‌ బిల్లుల నుంచే ఈ ఛార్జీల వసూలు ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యుత్‌ సంస్థలు మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్‌ మొత్తాన్ని వసూలు చేయాలని టీజీఈఆర్సీ నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు మినహాయింపు ఇచ్చింది. రైతుల వాటాగా ఉన్న రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. మిగిలిన రూ.5,420.23 కోట్లను ఇతర కేటగిరీల వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.

టీజీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో రూ.4,222.93 కోట్లు, టీజీఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో రూ.1,197.30 కోట్లను వసూలు చేయాలని నిర్ణయించారు. తొలి నెలలో యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత యూనిట్‌కు 50 పైసల చొప్పున ట్రూ-అప్‌ ఛార్జీ విధించనున్నారు.

టీజీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో 29 నెలలు, టీజీఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో 26 నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. వినియోగదారుల గత విద్యుత్‌ వినియోగాన్ని ఆధారంగా చేసుకుని ట్రూ-అప్‌ ఛార్జీలను లెక్కించనున్నారు.

ట్రూ-అప్‌ ఛార్జీని కరెంట్‌ బిల్లులో ప్రత్యేకంగా చూపించాలని టీజీఈఆర్సీ ఆదేశించింది. ఛార్జీ రేటు, వసూలు చేసే వ్యవధి, వసూలు విధానాన్ని బిల్లులో స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. వినియోగదారులకు ముందుగానే సమాచారం అందించేందుకు తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని డిస్కంలను ఆదేశించింది.