ఉమ్మడి ప్రకాశంలో ఇద్దరు వైద్యాధికారుల తొలగింపు
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
ఉమ్మడి ప్రకాశం: సుదీర్ఘకాలంగా విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఇద్దరు వైద్యాధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలిక సెలవులో ఉండి విధులకు హాజరుకాని 70 మంది వైద్యాధికారులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, కందుకూరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యాధికారులు ఉన్నట్లు తెలిపారు.
దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరై పరిపాలనా పరంగా ఇబ్బందులు కలిగిస్తున్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల తొలగింపునకు సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత అధికారులకు పంపించినట్లు సమాచారం.