BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 25 June 2026, 02:49 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం.

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
25 Jun, 2026 - 02:49 PM
51 వీక్షణలు

వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం.

ప్రారంభించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం.

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీబీ) నూతన శాఖను గురువారం ఘనంగా ప్రారంభించారు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి శాఖను ప్రారంభించారు.

రైతులకు, మహిళలకు చేరువలో బ్యాంకింగ్ సేవలు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్  మాట్లాడుతూ, “సహకార రంగాన్ని బలోపేతం చేయడం, రైతులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వెల్లటూరు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల చిరకాల కోరిక నేడు నెరవేరింది. ఈ నూతన శాఖ ద్వారా రైతులకు సకాలంలో పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహకారం వేగంగా అందుతుంది” అని పేర్కొన్నారు.

జిల్లాలో విస్తరిస్తున్న సహకార బ్యాంకింగ్.

కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం  మాట్లాడుతూ, “రైతు సంక్షేమమే ధ్యేయంగా కేడీసీసీబీ పనిచేస్తోంది. వెల్లటూరు బ్రాంచి ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులకు, మహిళా సంఘాలకు మరింత సౌలభ్యం కలుగుతుంది. డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు, రికవరీలో మన బ్యాంకు రాష్ట్రంలోనే ముందంజలో ఉంది” అని తెలిపారు.

అందుబాటులో సేవలు.

నూతన శాఖ ద్వారా పంట రుణాలు, డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు, డిపాజిట్ పథకాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు వెల్లడించారు. రైతులు పాస్‌బుక్, ఆధార్ కార్డులతో నేరుగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.