BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 25 June 2026, 02:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జులై 1 నుంచి ఈ-రవాణా విధానం అమలు.. మాన్యువల్ పర్మిట్లకు స్వస్తి: ఏపీ రవీంద్ర

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 02:45 PM
99 వీక్షణలు

కడప జిల్లా మైదుకూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఏపీ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ-రవాణా విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జులై 1వ తేదీ నుంచి చెక్‌పోస్టుల వద్ద నగదు వసూలు చేసి రసీదులు జారీ చేసే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ లైసెన్స్ కలిగిన వ్యాపారులు స్వయంగా ఆన్‌లైన్‌లో ఈ-రసీదు లేదా పర్మిట్ పొందించి, వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే వాహనదారులకు అందజేసి పంపాలని కోరారు. మార్కెట్ యార్డుల ఆదాయాలను పెంచడం, పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు వ్యవసాయ, వాణిజ్య పంటల రవాణాకు అధికారులు మాన్యువల్ పద్ధతిలో పర్మిట్లు జారీ చేసేవారని, ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి ఆన్‌లైన్ ద్వారానే పర్మిట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ-రవాణా విధానం అమలుతో అక్రమాలు, లోపాలకు అడ్డుకట్ట పడటంతో పాటు చెక్‌పోస్టుల వద్ద అవకతవకలు తగ్గుతాయని చెప్పారు.

ట్రేడ్ లైసెన్సులు లేకుండా లేదా సరైన పర్మిట్లు లేకుండా సరుకుల రవాణా చేసే వారు చెక్‌పోస్టు సిబ్బందిని తప్పుదారి పట్టించే అవకాశాలను నివారించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి సెస్ రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైదుకూరు మార్కెట్ యార్డు సిబ్బంది, రైస్ మిల్ యజమానులు, విత్తన వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.