BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 25 June 2026, 02:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు బైపాస్ పనులు వేగవంతం చేస్తామని హామీ.. మంత్రిని సన్మానించిన రైతులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 02:45 PM
155 వీక్షణలు

నూజివీడు పట్టణ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మైలవరం రోడ్డు నుంచి విస్సన్నపేట రోడ్డును కలుపుతూ ప్రతిపాదిత బైపాస్ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, భూములు కోల్పోయిన రైతులకు రావలసిన పరిహార నిధులను వెంటనే విడుదల చేయిస్తానని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

ఈ నేపథ్యంలో బైపాస్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఏనుగుల వెంకటేశ్వరరావు, లాయర్ కుమార్, గోళ్ల వాసు, గోళ్ల వెంకటేష్, పిట్ల రాజా, చిట్టూరి సోమశేఖర్, ఏనుగుల చక్రి తదితరులు గురువారం మంత్రి కొలుసు పార్థసారథిని ఆయన స్వగృహంలో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా బైపాస్ నిర్మాణం పూర్తయితే నూజివీడు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వారికి హామీ ఇచ్చారు.